నందమూరి రామకృష్ణ శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకున్నారు. ముందుగా ఆయన శ్రీవారి అలిపిరి మార్గం నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. అనంతరం పద్మావతి అతిథి భవనం వద్ద టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.