వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతి-మచిలీపట్నం మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు SCR ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైలు తిరుపతిలో ఆదివారం రాత్రి 10.20కి బయలుదేరి సోమవారం ఉదయం 7.30కు మచిలీపట్నం చేరుకోనుంది. అలాగే మచిలీపట్నంలో సోమవారం సాయంత్రం 5.40కి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20కి తిరుపతి చేరుకోనుంది. మే 26 దాకా ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.