సచిన్ టెండూల్కర్ కుటుంబంతో కలిసి అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా కజిరంగా నేషనల్ పార్కును సందర్శించి జీపు సఫారీ చేశారు. అనంతరం పార్కులోని ఏనుగులకు ఆహారం అందించి సరదాగా గడిపారు. సచిన్ రావడంతో ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.