TG: రోజువారీ కూలీలు పొద్దంతా పడ్డ శ్రమను మరిచిపోయే మత్తు కోసం ఆరాటపడుతుంటారు. వీరిని లక్ష్యంగా చేసుకొని కల్తీ కల్లు డిపో నిర్వాహకులు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్లుకు ఉన్న డిమాండ్‌ను బట్టి కల్లు లభ్యం కాకపోవడంతో నిర్వాహకులు కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. ధనాశతో వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.