అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రమాద వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. హోం మంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని సూచించారు. బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.