కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా భారీ విజయం

54చూసినవారు
కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా భారీ విజయం
AP: గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా భారీ విజయాన్ని సాధించారు. 7 రౌండ్లు ముగిసే సరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్‌పై ఆలపాటి రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.