హైదరాబాద్‌లో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌

81చూసినవారు
హైదరాబాద్‌లో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌
TG: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్‌ సమీపంలోని ఓ ఇంటికి ఆమె వచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే ఆమె స్నేహితుల ఇంటికి వచ్చానని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్