ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నక్సల్ ఉగ్రవాద సంకెళ్లను ఛేదించి, తీవ్ర తిరుగుబాటు బాధిత బీజాపూర్ జిల్లాలోని ఏడు పంచాయితీలకు తొలిసారిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని చివరి గ్రామమైన పమేడ్ వరకు బస్సులను నడుపుతోంది. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.