టీ తాగేందుకు రైలు దిగి.. 20 ఏళ్ల పాటు!

77చూసినవారు
టీ తాగేందుకు రైలు దిగి.. 20 ఏళ్ల పాటు!
AP: టీ తాగేందుకు రైలు దిగి.. రూపాయి జీతం తీసుకోకుండా 20 ఏళ్లపాటు వెట్టిచాకిరీలో మగ్గిపోయిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పారావు 2005లో పుదుచ్చేరి వెళ్తూ.. తమిళనాడులోని ఓ రైల్వే స్టేషన్‌లో టీ తాగేందుకు దిగారు. మళ్లీ ఎక్కేలోపు రైలు వెళ్లిపోయింది. చేతిలో రూపాయి లేదు. నడుచుకుంటూ కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నారు. అన్నాదులై అనే వ్యక్తి దగ్గర గొర్రెలకాపరిగా చేరారు. ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా వెట్టిచాకిరీ చేశారు. అప్పారావు దీనగాథ పలువురిని కంటతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్