‘గంజాయి’ అంటే ప్రసాదమని IIT బాబా అన్నారు. ఆయన వద్ద గంజాయి లభించడంతో NDPS చట్టం కింద జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడి వద్ద పరిమిత మోతాదులో గంజాయి ఉండటంతో విచారించి వదిలేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా బాబా చేసిన కామెంట్స్‌కు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.