నెల రోజుల శిశువుకు 40 వాతలు పెట్టిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. గంభరిగూడ పంచాయతీలోని ఓ కుటుంబానికి చెందిన నెల రోజుల చిన్నారి వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతోంది. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కుటుంబసభ్యులు పసివాడికి గాలి సోకిందని భావించారు. ఇనుప కడ్డీని కాల్చి శిశువు శరీరంపై 40 చోట్ల వాతలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది చిన్నారిని వెంటనే దగ్గరలోకి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.