ఉద్యోగులకు ఐఆర్, పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్

66చూసినవారు
ఉద్యోగులకు ఐఆర్, పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్
ఏపీలో ఉద్యోగులకు మధ్యంతర భృతి, 12వ పీఆర్‌సీని ప్రకటించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ కార్యాలయాల్లో పాత రికార్డులకు భద్రత లేదు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో దోషులెవరో ఇంకా తేలలేదు. ఈ ఘటనలతో ఉద్యోగులు భయపడుతున్నారు. అలాగే ఉద్యోగులకు మధ్యంతర భృతి, 12వ పీఆర్‌సీని ప్రకటించాలి.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్