కొత్త అల్లుడికి ఏకంగా 470 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన ఘటన తాజాగా యానాంలో చోటుచేసుకుంది. యానాం వర్తకసంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన సాకేత్‌తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు. ఈ క్రమంలో అల్లుడు, కూతురిని కూర్చోబెట్టి 470 రకాల వంటకాలను వడ్డించారు.