ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బస్ కండక్టర్ కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.ఎల్.మీనా ఆగ్రా రోడ్‌లోని కనోటా బస్టాప్‌లో దిగాల్సి ఉంది. అయితే, కండక్టర్ స్టాప్ అనౌన్స్ చేయకపోవడంతో బస్సు తర్వాతి స్టాప్‌కు చేరుకుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాదం చెలరేగి రిటైర్డ్ అధికారిపై కండక్టర్ దాడి చేశాడు. అనంతరం అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.