వైసీపీ నుంచి ఎన్నికల బరిలో డైరెక్టర్ వినాయక్..?

243831చూసినవారు
వైసీపీ నుంచి ఎన్నికల బరిలో డైరెక్టర్ వినాయక్..?
ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. కొత్త లెక్కలు, కొత్త అభ్యర్థులతో వైసీపీ టెన్షన్ పెంచుతోంది. నేతల రాజీనామాలు.. కొత్త నేతల చేరికలతో పొలిటికల్ హీట్ పెరిగింది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ వైసీపీలో చేరటానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. వినాయక్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా బరిలో దిగనున్నారు. వినాయక్ ను కాకినాడ లేదా ఏలూరు ఎంపీ బరిలో దింపాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.