ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు తప్పవు: కేంద్రం

77చూసినవారు
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు తప్పవు: కేంద్రం
తరచూ ఆఫీస్ లకు ఆలస్యంగా వచ్చి త్వరగా ఇళ్లకు వెళ్లే ఉద్యోగుల సమస్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది. చాలా మంది ఉద్యోగులు ఆధార్‌తో అనుసంధానించబడిన బయోమెట్రిక్ విధానంలో తమ హాజరును నమోదు చేయడం లేదని, మరికొందరు తరచుగా ఆలస్యంగా వస్తున్నారని పేర్కొంది. ‘ఆలస్యంగా వస్తే ఒక్కోరోజుకు ఒకపూట సాధారణ సెలవు చొప్పున కోతపెట్టాలని సూచించింది.

సంబంధిత పోస్ట్