ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు ఉందా?

65చూసినవారు
ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు ఉందా?
AP: మార్చి 14న పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. పదేళ్ల రాజకీయ ప్రస్థానం ముగించుకుని 11వ ఏటా అడుగుపెట్టనుంది. ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు. టీడీపీతో మిత్రుడిగా ఉన్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేన సమకూర్చుకుంటుందా? లేదా? చూడాలి.