AP: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. యువకుల కుటుంబ సభ్యుల బాధపై మాజీ మంత్రి ఆర్‌కె.రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!’ అని ట్విట్టర్ ‘ఎక్స్’లో రోజా ఓ వీడియోతో పోస్ట్ చేశారు.