కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య నేపథ్యంలో భారత్ పై ఆరోపణలు చేయడంతో ట్రూడోపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆయన తన పదవీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి.