‘జైలర్’ తర్వాత రజనీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ 70 శాతం పూర్తయిందని, జనవరి 25 నాటికి మొత్తం పూర్తిచేయాలని ఆలోచనలో ఉన్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.