కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో తనపై అక్రమంగా ఇరికించారని, కేసును కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అయితే నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.