AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారని, 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.