వెలమల సంక్షేమానికి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని అనపర్తి మండపేట ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జోగేశ్వరరావు అన్నారు. బిక్కవోలు మండలం బలబద్రపురంలో వెలమ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన అనపర్తి మండపేట నియోజకవర్గ వెలమ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించారు.