పెదపూడి: వృథాగా పోతున్న తాగునీరు
కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో చెరువు సెంటర్ వద్ద గత కొంతకాలంగా పైప్ లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతుందని స్థానికులు మంగళవారం తెలిపారు. తాగునీటి వృథా కారణంగా దళిత కాలనీకి సక్రమ మంచినీటి సరఫరా కూడా లేకుండా పోతుందని ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టి పట్టనట్లు వ్యవహరించడంతో అక్కడ వృథా, ఇక్కడ ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా రిపేర్లు చేయాలని కోరారు.