బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి మరోసారి నోటీసులు

71చూసినవారు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి మరోసారి నోటీసులు
TG: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌ ఫామ్​హస్​లో కోడి పందాలు, క్యాసినో వ్యవహారంలో పోలీసులు గతంలోనే  శ్రీనివాస్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మాదాపూర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. శుక్రవారం మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్