

కాల్వకుర్తి: డెయిరీల వద్ద పాడి రైతులు ధర్నాలు
కాల్వకుర్తి మండలం మార్చాల, కుర్మిద్ద, వెంకటాపూర్, జంగారెడ్డిపల్లి, తిమ్మరాసి పల్లి, జీడిపల్లి తదితర గ్రామాల్లోని డెయిరీల వద్ద పాడి రైతులు ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కిశోర్, ఖాజా మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి రైతులకు పెం డింగ్‌లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో వెంకట్‌రెడ్డి, శంకర్‌నాయక్, యాదయ్య, శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.