నాగర్ కర్నూల్: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం
తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుతం ఉన్న పాలసీలను సమూలంగా మార్చాల్సి ఉంటుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని స్కూళ్లను హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతము ఒక్కో సంక్షేమ హాస్టల్లో ఒక్కో పాలసీ ఉందని, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లల్లో ఉన్న పాలసీలను సమూలంగా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందని అన్నారు