కల్వకుర్తి: భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. బిజెపి కళ్యాణ్ నాయక్.
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్యా తండాకు చెందిన గిరిజనుల భూములను కొంతమంది అక్రమ మార్గంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీనిని ఖండిస్తూ సోమవారం నిరసనగా గిరిజనుల భూములను వారికే చెందేటట్లుగా చేయాలని కోరుతూ కల్వకుర్తి ఆర్డీవో శ్రీను నాయక్ కి ఎస్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ వినతి పత్రం అందజేశారు.