జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం కొనసాగిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారు తెలిపిన సమస్యలు నమోదు చేసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.