అమలాపురంలోని స్థానిక చెన్నమల్లేశ్వర స్వామి గుడి సమీపంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాల వద్ద మహిళల సంరక్షణపై గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు పాల్గొని విద్యార్థినులకు మహిళా చట్టాలు, మహిళల రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే పలు సూచనలు ఇచ్చారు.