గ్రామాల్లో జనసేన స్థూపాలు ఆవిష్కరించాలి

80చూసినవారు
గ్రామాల్లో జనసేన స్థూపాలు ఆవిష్కరించాలి
గ్రామగ్రామాన జనసేన స్థూపాలు ఆవిష్కరించాలని అమలాపురంలో బుధవారం జరిగిన నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. అమలాపురం రూరల్ మండల శాఖ జనసేన అధ్యక్షుడు లింగోలు పండు సభకు అధ్యక్షత వహించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అమలాపురం నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జిని నియమించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కోరాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్