కాకినాడ: కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట

72చూసినవారు
కాకినాడ: కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట
కాకినాడలో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో అభిషేకాలు చేపట్టారు. పుణ్యతీర్థాల్లో నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసిన భక్తులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్