కాకినాడ: దళితుల మధ్య చిచ్చు
దళితులంతా ఐకమత్యంగా ఉండేవారని, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల వర్గీకరణ పేరిట వారి మధ్య చిచ్చుపెట్టారని తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆరోపించారు. బుధవారం ఆయన కాకినాడలో జయ హోటల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సి వర్గీకరణకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆరోపించారు.