హరహర మహాదేవ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భం గా కాకినాడ రూరల్ తూరంగి ఈశ్వర ఆలయంలో హరోం హర నినాదాలతో శివభక్తుల ఆధ్వర్యాన పది వేల దీపాలతో దామోదరునికి అత్యంత ఘనంగా జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఓం త్రిశూలం ఢమరుకం మున్నగు అలంకారాలను సోమవారం రాత్రి ఏర్పాటు చేసారు స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ప్రత్యేక అతిథిగా పాల్గొని నిర్వాహకులకు ప్రత్యేకఅభినందనలు తెలియజేశారు.