కాకినాడ రూరల్: నిరంతర సాధనతో విజయం తధ్యం
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని విద్యార్థులు అలవర్చుకోవాలని బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు టి రంగబాబు తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడ రూరల్ శాంతినగర్ లో గల శ్రీ అగస్త్య విశ్వక్ క్యాంపస్ లో నూతనంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఓటమి చెందిన నిరంతర ప్రయత్నం, సాధన తో పరిశ్రమిస్తే అది విజయంగా మారుతుందన్నారు.