వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న కలెక్టర్ శుక్ల దంపతులు

66చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలెక్టర్ హిమాన్షు శుక్ల దంపతులు శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ అధికారులు కలెక్టర్ దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

సంబంధిత పోస్ట్