డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారిని మేలు కొల్పారు. అనంతరం భక్తుల దైవ దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.