ప్రజల సౌకర్యార్థమై కొవ్వూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు నూతన బస్సును కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవ్వూరు డిపోకి కొత్తగా మూడు బస్ సర్వీసులను తీసుకొచ్చామని, దీనికి కృషి చేసిన డిపో మేనేజర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంఠమణి రామకృష్ణ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.