మండపేట పట్టణంలోని వీధుల చివర చెత్త వేయడంపై మున్సిపల్ కమిషనర్ బి రాము సోమవారం పారిశుద్ధ్య కార్మికులను నిలదీశారు. దీంతో వారు పరిసరాల వారు చెత్తను తీసుకొచ్చి వేస్తున్నారన్నారు. పారిశుద్ధ్య కార్మికులు రానిపక్షంలో చెత్తను ఎవరి ఇంటి వద్ద వారు ఉంచుకొని చెత్త సేకరించే వారికి నేరుగా అందించాలన్నారు. అనంతరం నివాసితులతో మాట్లాడుతూ చెత్తను ఒకేచోట వేయడం వల్ల దోమలు, ఈగలు ప్రబలి డయేరియాకు దారితీస్తాయన్నారు.