
మండపేట: మామిడి రైతులను తక్షణం ఆదుకోవాలి
మామిడి రైతులను తక్షణం ఆదుకోవాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపల్యం వ్యవసాయ మార్కెట్ లో సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి భాస్కరయ్య, జిల్లా ఇన్చార్జి పీసీసీ ఉపాధ్యక్షులు డి రాంభూపాల్ రెడ్డి లతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను మామిడి పండ్ల పంటలు పై సాధక, బాధలపై పై అడిగి తెలుసుకున్నారు.