కాట్రేనికోన: బరుల వద్ద మినీ ఏటీఎం సౌకర్యం

72చూసినవారు
కాట్రేనికోన: బరుల వద్ద మినీ ఏటీఎం సౌకర్యం
కోడిపందాల నిర్వాహకులు పందేలు జరిగే ప్రాంతంలో సోమవారం మినీ ఏటీఎం సౌకర్యం కల్పించారు. జేబులో నగదు లేకపోయినా మీ ఖాతాలో డబ్బులు ఉంటే వెంటనే నిర్వాహకులకు ఫోన్ పే చేస్తే నగదు ఇస్తారు. కాట్రేనికోన మండలం గెద్దనాపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నగదు అందిస్తున్నారు. ఏటీఎంలో నగదు లేకపోవడం నిర్వాహకులు పందెం రాయుళ్ల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. కొంతమంది ఫోన్ పే చేసి నగదు తీసుకుని పందేలు కాస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్