ముమ్మిడివరంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుపై మంగళవారం దాడులు నిర్వహించారు. అయినాపురంలో ఒక వ్యక్తి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అతని షాపుపై దాడి చేశారు. ఈ దాడుల్లో 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.