మొగ తవ్వితే సహించేది లేదు

82చూసినవారు
మొగ తవ్వితే సహించేది లేదు
కూనవరం స్ట్రెయిట్ కట్ గచ్చకాయలపోర వద్ద సముద్రంలో కలిసే మొగను తవ్వితే సహించేదిలేదని ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 300 మంది రైతులు పేర్కొన్నారు. ఆ మేరకు గురువారం సత్తరువులో సమావేశమై నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామన్నారు. సముద్రపు ఉప్పునీరు చేలల్లోకి, కాలువల్లోకి రాకుండా ఏటిగట్లను పటిష్టపరచి మొగను తవ్వుకుంటే అభ్యంతరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్