పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గండేపల్లి మండలం సురంపాలెంలో సారాయి తయారీకి నిల్వ ఉంచిన సుమారు 600 లీటర్ల బెల్లపు ఊటను ఆదివారం ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే యర్రంపాలెం గ్రామంలో అక్రమ మద్యం సీసాలు అమ్ముతున్న మహిళా వద్ద నుంచి 10 డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ స్వాధీన పరచుకుని కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సీఐ అర్జునరావు మీడియాకు తెలిపారు.