డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4, 5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని పేర్కొన్న వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఆయా సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సిబ్బంది పేర్కొన్నారు.