గొల్లప్రోలు: ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ సందర్భంగా శనివారం గొల్లప్రోలు పట్టణంలో మెయిన్ రోడ్డులో ఆయన విగ్రహానికి టిడిపి శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచి ఉంటారని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని గెలిపించేందకు ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని, ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ స్పూర్తితో వచ్చినవేనని తెలియజేశారు.