పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నందు పిఠాపురం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గురువారం శిశు రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో గర్భిణీలకు, రోగులకు శిశు రక్షణపై అవగాహన కల్పించి వాళ్ళకి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని తెలియజేశారు. అక్రమ రవాణా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.