పిఠాపురం: భవన నిర్మాణ కార్మికుల ఆకలి బాధలు తీర్చాలి

71చూసినవారు
పిఠాపురం: భవన నిర్మాణ కార్మికుల ఆకలి బాధలు తీర్చాలి
ఇసుక కొరత నివారించి భవన నిర్మాణ కార్మికుల ఆకలిబాధలు తీర్చాలని రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గొల్లప్రోలులోని ప్రధాన రహదారిపై శుక్రవారం కార్మికులు రాస్తారోకో చేశారు. అనంతరం ప్రదర్శనగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. తహసీల్దారు కె. వి. వి. సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. రెండు నెలలుగా ఇసుక కొరతతో భవన నిర్మాణ పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్