ప్రత్తిపాడు: రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
కాకుమాను మండలంలోని వరి పండించే అన్ని గ్రామాలలో 11 రైతు సేవా కేంద్రాల యందు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మండల ఏవో కిరణ్మయి తెలిపారు. శుక్రవారం కాకుమాను మండల కేంద్రంలో రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మండలంలో 4200 క్వింటాళ్లు ధాన్యాన్ని సేకరించడం జరిగిందని ఏవో తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.