ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఏపీసీఎన్ఎఫ్ ట్రైనర్ ఇన్ -ఛార్జ్ సిహెచ్ వరప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విక్రయ కేంద్రాన్ని పెదనందిపాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు.